40వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన-తెలుగుదేశం ప్రభుత్వం భాగంగా జనసేన పార్టీ విజయవాడ అధ్యక్షులు పశ్చిమ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు 40వ డివిజన్ లో జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి 40వ డివిజన్ సమన్వయకర్త, న్యాయవాది ఎం.హనుమాన్ ఆధ్వర్యంలో బాల భాస్కర్ నగర్ లో పర్యటన జరిగింది. పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు డివిజన్లో అనేక సమస్యలు తెలియజేయడం జరిగింది. 40వ డివిజన్లో రోడ్లు సరిగా లేకపోవడం, దోమల సమస్య అధికంగా ఉండడం, చాలామందికి పెన్షన్ కూడా రావడం లేదని స్థానికులు తెలియజేశారు. వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కి అనేకసార్లు తెలియజేసిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఈ వైసీపీ దౌర్జన్య పాలనను ప్రజలు అంతం చేస్తారని ఇప్పుడు ప్రజలు పూర్తి మద్దతు జనసేనకి ఉందని హనుమాన్ తెలిపారు.