శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు పూర్తి అయ్యి కొత్తగా ఓటు హక్కు కలిగిన యువత వారి మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి వారి ఓటును సద్వినియోగం చేసుకుంటాం అని తెలియచేసారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ మన దేశములో యువత శాతం పెరుగుతొంది, మన దేశఒ 2020 నాటికి ప్రపంచములో అత్యంత యువ దేశంగా నిలిచింది.దేశ జనాభాలో 40 శాతం ఉన్న యువత అత్యంత మానవ వనరు అని చెప్పవచ్చు జాతి భవిష్యత్తు వారే కనుక యువత నిర్వహించాల్సిన పాత్ర మహత్త రమైంది. వారి సృజనాత్మకత ఉత్సాహం శక్తి ‌కలిసి దేశంలో అద్భుతఫలితాలివ్వగలవు. దేశాన్ని అభివృధి పథంలో నడిపేందుకు దోహదపడే‌ భలమైన మానవ వనరులు యువత. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపే సత్తా వున్న యువతకు, దేశ రాష్ట్ర స్థాయి రాజకీయాలలో వివిధ రాజకీయ పార్టీలు యువకులకు విద్యావంతులకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రాజకీయ పార్టీలు అనుబంధ సంఘాలలో విద్యార్థి సంఘాలు.యువజన సంఘాలు, మరికొన్ని సంఘాలలో యువకులు విద్యావంతులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, కంచికచర్ల మండలాధ్యక్షులు నాయిని సతీష్, నందిగామ పట్టణ అధ్యక్షులు తాటి శివకృష్ణ, 20వ వార్డు అనాసాగరం కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.