ప్రతిచేతికీ ఉపాధికోసం యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో నిఖిలే సతీష్, నికిలే సురేష్ ల ఆధ్వర్యంలో స్థానిక 8 డివిజన్ కొత్త కాకినాడ, డిఎంకే చర్చి రోడ్ నందు ప్రతిచేతికీ ఉపాధికోసం యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడలో పుట్టిపెరిగిన యువతకి ఉపాధి ఇక్కడే కల్పించాలన్నారు. ఈ ప్రాంతంలోనే పని, ఇల్లు ఇవ్వడం అన్న ప్రభుత్వ బాధ్యతనుండీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరన్నారు. తనబాధ్యలు నిర్వహించలేని ఈ ముఖ్యమంత్రి మరి ఏమొహంపెట్టుకుని సిద్ధం అని మరోసారి అధికారాన్ని పొందేందుకు తయరవుతున్నాడో ప్రజలకి అర్ధంకావడంలేదన్నారు. ఈకొత్త కాకినాడ అనే ప్రాంతాన్ని లోగడ తన తండ్రిగారైన శ్రీ ముత్తా గోపాలక్రిష్ణగారు అభివృద్ధిపరిచి ఇళ్ళు ఇచ్చారనీ నేడు అది పట్టణప్రాంతానికి నడిబొడ్డు అయ్యిందనీ కానీ నేడు ఈఇళ్ళలో యువతలేరనీ కారణం ఉపాధికోసం వెరే వేరే ప్రాంతాలకు వలసపోవడం అన్నారు. దీనికి అడ్డుకట్టవేయాలనీ వీరికి కాకినాడలోనే ఉపాధి కావాలనీ వారి వారి కుటుంబాలతో సౌఖ్యంగా జీవించాలనీ దానికోసం జనసేన యుద్ధానికి సిద్ధం అనీ అంతే తప్ప ఫాక్టరీలు లాక్కోడానికీ, భూకబ్జాలు చేయడానికి, దౌర్జన్యాలకి కాదన్నారు. రాబోయే జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈప్రాంతంలోని యువతకి ఉపాధి కలుగచేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నికిలే సతీష్, నికిలే సురేష్, డొంకా సూరిబాబు, వరిపిల్లి సురేష్, గడగల చిన్న, మసేనయ్య, రాజారావు, దేవ రాజు, జగదీష్, కామేశ్వరరావు, కుండి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.