కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో మీకోసం జనసేన

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ 21వ డివిజన్ జె.రామారావు పేటలోని పద్మశాలీ కుటుంబాలవారిని కలిసి మీకోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఒకనాడు కాకినాడ అన్నిరకాల కులవృత్తుల వారితో సుభిక్షంగా ఉండేదనీ, కానీ గత అయిదు సంవత్సరముల కాలంగా కులవృత్తులు క్షీణించే పరిస్థితిలోకి జారాయనీ, కారణం ప్రభుత్వం వీరిని ప్రోత్సహించకపోవడమే అన్నారు. పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు స్వయంగా వారి కాళ్ళమీద నిలబడటానికి ప్రభుత్వ సహకారం లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. జనసేనపార్టీ ఒకటే ఆలోచన అనీ ప్రతి మహిళా మహిళాసాధికారతతో ఆర్ధికంగా నిలబడాలి అని వారికి దేవుడిచ్చిన వరం చేతిలో నైపుణ్యం ఉండటమనీ వీరికి కావలిసిన మగ్గాలు, మెటీరియల్ని సహకారసంఘాల ద్వారా అందించే ఏర్పాటు జనసేనపార్టీ చేయబోతొందన్నారు. కాకినాడలో ఎనిమిదివేల పద్మశాలీ కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఒకేఒక మగ్గం నడవడం మిగిలినవారు పేదరికం వల్ల నిర్వహించలేకపోవడం మనసు కలచివేస్తోందన్నారు. వీరు బయటకు వేరే పనులకు వెళ్ళడం దురదృష్టమనీ, అదికూడా ఒక్క రొయ్యల ఫేక్టరీలో తప్ప మరెక్కడా రాడంలేదన్నారు. కాకినాడలో మహిళలకి స్వయం ఉపాధి కల్పించేలా జనసేన పార్టీ ప్రోత్సహిస్తాదనీ, కాకినాడలో అన్ని కులవృత్తులు కూడా అభివృద్ధి చెందాలనీ, వీరిద్వారా ఆయా కుటుంబాలు ఆర్ధికంగా పైకి రావడానికి జనసేన ప్రభుత్వం కృషిచేస్తాదని హామీ ఇచ్చారు. వీరికి పక్కాగృహాలతోపాటూ మగ్గంతో నేసుకునేలా వెసులుబాటు ఉండేలా చూస్తామని తెలిపుతూ అందరికీ మంచిరోజులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దుగ్గిన బాబ్జి, చేనేత కార్మికులు వదిగే లక్ష్మీ, వదిగే గోపీనాథ్, జనసేన నాయకులు శివాజీ యాదవ్, దాలిపర్తి చిన్ని, 35 వార్డు జనసేన అధ్యక్షులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.