బోనెల విజయచంద్రని కలిసి అభినందనలు తెలిపిన పార్వతీపురం జనసేన నాయకులు

🚩 ఉమ్మడి అభ్యర్థి విజయానికి అందరూ కృషిచయ్యాలి. మనభాద్యత నిర్వర్తించాలి.

🚩 జనసేన తోడుతో పార్వతీపురంలో విజయం మనదే – బొనెల విజయ్ చంద్ర

పార్వతీపురం నియోజకవర్గం, జనసేన – తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రకటించిన అభ్యర్థి బోనెల విజయ్ చంద్రని ఆదివారం నియోజకవర్గ నాయకులు చందక అనీల్, నెయ్యిగాపుల సురేష్, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ, మానెపల్లి ప్రవీణ్, రేవల దుర్గ, కూర్మ తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం ఇరు పార్టీలు చర్చించుకొని ఇకపై చెయ్యబోయే కార్యక్రమాలు ఏవిధంగా చెయ్యాలి. మన భాద్యతలు తదితర అంశాలపై చర్చించుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. జనసేన తోడుతో పార్వతీపురంలో విజయం మనదే అని విజయ చంద్ర చెప్పి అందరిలో ఒక ఉత్సాహం తీసుకొచ్చారు. ఇంటింటి ప్రోగ్రాంలో అందరూ చురుకుగా పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.