హర్ ముస్లిం జనసేన-టీడీపీ కె సాత్

చంద్రగిరి, హర్ ముస్లిం జనసేన – టీడీపీ కె సాత్ అనే కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుల సహకారఒతో సోమవారం నుండి ప్రారంభమవుతుంది దీనికి సంబంచిన కరపత్రాన్ని చంద్రగిరి నియోజకవర్గ జనసేన – టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విడుదల చేసిన తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఎం.నాసీర్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ మాట్లాడుతూ చేతకాని, ఈ అవివేకపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత, చేతకాని నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఇప్పటికే అప్పుల ప్రదేశ్ గా మారిపోయింది. ఆ నాడు 2019 ఎన్నికల సందర్బంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తుంగలో తొక్కి ముస్లింలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి గారు మాత్రమే ఈ హర్ ముస్లిం జనసేన – టీడీపీ కె సాత్ అనే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతలు ప్రతి ముస్లింలకి చేరవేసి ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితికి పవన్ కళ్యాణ్- చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియచేసి మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి రెండు సార్లు అవకాశం ఇస్తే చంద్రగిరి నియోజకవర్గానికి ఏమి చేసిందేమి లేదు తాయిలాలు పంచుతూ అదే అభివృద్ధి అనే ధ్యాసలో ఉండి ప్రజలని ఏమార్చాలనే ఉద్దేశం తో ఉన్నాడు, చంద్రగిరి నియోజకవర్గం లో జనసేన – టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతయిన ఉంది ప్రజల ఆశీర్వాదముతో రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ గారు – చంద్రబాబు గారి కూటమి గెలిచి మన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదంతో పులివర్తి నాని గెలిస్తే ముస్లిం సోదరులకు చేసే పనులను తెలియచేసి ముస్లింలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈ హర్ ముస్లిం జనసేన-టీడీపీ కె సాత్ కార్యక్రమం ఉండబోతోంది అని తెలియచేసారు. పాకాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు గురునాథ్ తలారి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గెలవడం ఎంతో అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరులను ఏమర్చి గెలిచిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. పాకాల మండల ఉపాధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ వైసీపీని గద్దె దించి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాల్సిసిన అవసరం ఎంతయినా ఉంది అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు షఫీ మాట్లాడుతూ 2019లో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు సంబంధించి ఎన్ని అయితే హామీలు ఇచ్చారో ఒకటి కూడా అమలు చేసింది లేదు చంద్రగిరి నియోజకవర్గంలో యువతని గంజాయికి అలవాటు చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తూ లాభం పొందుతున్నారని తెలియజేశారు. పాకాల మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రహంతుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నాని గెలవడం ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నాసిర్, పాకాల మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గుర్నాథ్ తలారి, టిడిపి సీనియర్ నాయకులు షఫీ, టిడిపి సీనియర్ నాయకులు ఇమామ్ సాహెబ్, పాకాల మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు దినేష్ రాయల్, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్లా, పాకాల మండల కార్యదర్శి షాజహాన్, మస్తాన్ జనసేన నాయకులు నౌమూన్, వాసు రాయల్, తాహీర్, జనసేన పార్టీ కార్యాల ఇన్చార్జి మస్తాన్ (డాన్) మరియు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.