ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల స‌త్తా జ‌న‌సేన‌-టీడీపీకే ఉంది: పెంటేల బాలాజీ

  • ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారింది
  • వైసీపీ కుట్ర‌లు నమ్మ‌వ‌ద్దు
  • వైసీపీ కుట్ర‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

చిల‌క‌లూరిపేట‌, రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల స‌త్తా జ‌న‌సేన‌-టీడీపీకే ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ విశ్వ‌సిస్తున్నారని, ఇందులో భాగంగానే ఉమ్మ‌డి పార్టీల ఆధ్వ‌ర్యంలో తాడేప‌ల్లిగూడెంలో నిర్వ‌హించిన జెండా మ‌హాస‌భ విజ‌య‌వంతం కావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని జన‌సేన‌ పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ తాడేప‌ల్లిగూడెంలో నిర్వ‌హించిన స‌భ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని, వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో పెల్లుబికిన ఆగ్ర‌హాజాల‌లు ఈ స‌భ‌లో సుస్ప‌ష్టంగా క‌నిపించాయ‌ని తెలిపారు. ఈ పొత్తుకు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్న స‌భ విజ‌యం సుస్ప‌ష్టం చేసింద‌న్నారు. విజ‌యం చేరువ‌లోనే ఉంద‌ని, దీన్ని అందుకోవ‌డానికి జ‌న‌సేన‌-టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ లేఖ ఫేక్‌… 24 సీట్ల‌తో ఏక‌భ‌వించండిలేదా వైసీసీకి వెళ్లి పోండి అనే పేరుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన‌ట్లు ఒక లేఖ‌ను అధికార వైసీపీ నాయ‌కులు స‌ర్క‌లేట్ చేస్తున్నార‌ని అది ఫేక్ అని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో జ‌నసేన పేరుతో అనేక అంశాలు ట్రోల్ చేస్తున్నార‌ని, వీటి ప‌ట్ల జ‌న‌సేనికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వివ‌రించ‌రు. కుట్ర‌ల‌ను నమ్మ‌ద్దు. అధికారంలో ఉన్న వైసీసీ ప్ర‌భుత్వం ఓట‌మి భ‌యంలో అనేక ర‌కాల కుట్ర‌ల‌కు తెర‌లేపింద‌ని, పొత్తును విఫ‌లం చేసి, జ‌న‌సేన‌- టీడీపీలు అనైక్యంగా ఉంటే విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని బ్ర‌మ‌లు ఉన్నార‌ని వివ‌రించారు. ప్ర‌తి రోజూ ఏదో ర‌కంగా పొత్తుల‌పై వైసీసీ నాయ‌కులు అతిగా స్పందిస్తున్నార‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. వైసీసీ ఉచ్చులో ప‌డ‌వ‌ద్ద‌ని, సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అభూత‌క‌ల్ప‌న‌లు, అవాస్త‌వాల‌ను ప‌ట్టించ‌కోరాద‌ని హిత‌వు ప‌లికారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఇదే విష‌యాన్ని చెప్పార‌ని, ప‌వ‌న్ రాష్ట్ర భ‌విష్య‌త్తుకోసం తీసుకొన్న నిర్ణ‌యాన్ని ఆమెదించాల‌ని, నాయ‌కుడు సూచించిన బాట‌లో న‌డిచి కూట‌మి అధికారంలో వ‌చ్చేలా క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. మీరు నిజంగా నా మద్దతుదారులైతే నా వ్యూహాన్ని ప్రశ్నించకండి, నా వెంట నిలబడండి, నాతో పాటు నడవండి అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల‌ను గుర్తుంచుకోవాని సూచించారు. ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారింద‌ని, స‌భ విజ‌యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయపు జెండా ఖాయ‌మైంద‌న్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌భ ద్వారా స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. రానున్న రోజులో్ల ప్ర‌తి రోజును ఉమ్మ‌డి ఎజెండాను ప్ర‌జ‌ల్లో తీసుకొ వెళ్లి ప్ర‌జా మ‌ద్ద‌తు స‌మీక‌రించాల‌ని, విజ‌య‌మే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని పిలుపు నిచ్చారు.