అభివృద్ధికి నోచుకోని కృష్ణపట్నం బీచ్

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు అనుకొని ఉన్న కృష్ణపట్నం బీచ్ ని గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఎంతో అనువైన ప్రాంతం సముద్ర తీర ప్రాంతం. ఈ సముద్ర తీర ప్రాంతం సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాలలో అనుకొని 30 కిలోమీటర్లు ఉంది. అయితే ఈ రెండు మండలాల్లో కూడా రెండు బీచ్లు ఎంతో అధికంగా ఆహ్లాదకరమైన వాతావరణయాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. కానీ ఈ పర్యటక శాఖ మంత్రి డైమండ్ రాణి రోజా ఈ రెండు బీచ్ లను కూడా అభివృద్ధి చేయలేదు. పర్యాటక శాఖ మంత్రి అయిన తర్వాత వారానికి రెండు రోజులు అనేకమందిని తిరుమల దర్శనానికి తీసుకొని వెళ్లి కాసులను వసూలు చేసుకోవడానికి ఆమె టైం సరిపోలేదు. మరి పర్యటక రంగానికి సంబంధించి ఏమి అభివృద్ధి చేస్తుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, జనసైనికులను విమర్శించడం తప్ప ఆమె శాఖకు, ఆమెకి, ఆమె చేసే పనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ డైమండ్ రాని రోజు అని రేపు రాబోయే ఎన్నికల్లో ఆవిడ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా లేకుండా ప్రజలే ఓడిస్తారు. రోజాకి ఈరోజు ఈ పూజ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేదు పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధి చేయలేదు కాబట్టి మీరు ప్రజానాయకులుగా ఈ రాష్ట్రంలో మంత్రులుగా పనికిరారు. కాబట్టి మీకు రేపు రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు కూడా డిపాజిట్లు కూడా లేకుండా ఓడిస్తారు. రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏదైతే మద్రాస్ లో ఉన్నటువంటి మెరీనా బీచ్ ని తలపించే విధంగా ఉన్న కృష్ణపట్నం బీచ్ కి రోడ్డు నిర్మాణం చేయించి ఎంతో పర్యాటకపరంగా కి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, మస్తాన్, గిరి, నికిత్, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.