మానవత్వం చాటుకున్న తుని జనసైనికులు

తుని నియోజకవర్గం, తుని మండలం, కె.ఓ మల్లవరం గ్రామంలో పోలియోతో బాధపడుతున్న యువకుడికి ఆ ఊరి గ్రామస్తులు 4 సంవత్సరాల నుండి ఎంతో మందిని సహాయం కోరిన నెరవేరలేదు. ఈ విషయాన్ని తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ దృష్టికి తీసుకురావటం జరిగింది. వెంటనే స్పందించి ఆ యువకుడికి ఎలక్ట్రిక్ బండి కొనుక్కునేందుకు సహాయం అందించటం జరిగింది. శుక్రవారం ఆ యువకుడికి తుని మండల అధ్యక్షులు దాకొండ వెంకటరమణ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు బొప్పన రాము, తుని టౌన్ నాయకులు అద్దేపల్లి బాలాజీ, పైడికొండ ఎంపిటీసి అభ్యర్థి గట్టెం నాగబాబు, తుని మండల ప్రధాన కార్యదర్శి నానాజీ మరియు కే.ఓ మల్లవరం గ్రామ జనసైనికులు లోకవరపు రాజబాబు(మండల సంయుక్త కార్యదర్శి), పి.ఎన్.వి గణేష్ (గ్రామ అధ్యక్షులు), కోరుప్రోలు పేద సత్తిబాబు, కొరుప్రొలు రమణ,గదుల చిట్టిబాబు, నల్లల నాగబాబు, నల్లల రాజుబాబు, నడిపింటి రాము, నడిపింటి లక్ష్మణ, మేడిశెట్టి ప్రసాద్, ఎస్.కె స్వామి, నల్లల శివాజీ, కె.ఎస్.వి రమణ, బంగారు నాగేంద్ర, కోరుప్రోలు గణేష్, కొరుప్రొలు ఆనంద, నడిపింటి కన్నబాబు మరియు గ్రామ పెద్దలు గ్రామ జనసైనికులు పాల్గొనటం జరిగింది. కష్టం ఎక్కడ ఉన్న ఆపద ఉన్నది అని తెలిస్తే తుని నియోజకవర్గం జనసైనికులు వారికీ ఎప్పుడూ తోడు ఉంటారు అని తెలియజేయటం జరిగింది.