జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదు

  • రౌడీ రాజకీయాలు చేయడం కాదు హుందా రాజకీయాలు చేయడం నేర్చుకోండి
  • బెదిరిస్తామంటే జనసైనికులు ఎవరూ బెదిరిపోరు, తిరగబడతారు
  • బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో సచివాలయాలు, వైసీపీ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, చివరికి పోలీస్ స్టేషన్లు కూడా వైసిపి అడ్డాల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు మా పార్టీ కార్యకర్త తోటపల్లిగూడూరు మండలంలో పోస్టర్ మీద రెడ్ మార్కు పడిందని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి తీసుకెళ్లి రాత్రి పదిన్నర వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. మా కార్యకర్త ఏమైనా ఖూనీ చేశాడా లేదా ఏమైనా దొంగతనం చేశాడా, మానభంగం ఏమైనా చేశాడా ఏం చేస్తే తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. మేము 20 నుంచి 30 మంది కార్యకర్తలు వెళ్లి పోలీస్ స్టేషన్ వద్ద కూర్చుంటే రాత్రి 10:30 వరకు పంపించకుండా మా కార్యకర్త ఒక్కడినే పెట్టి వైసిపి గుండాలను స్టేషన్ లోపలి కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారా. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా రాబోయేది జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మీలాగా రౌడీ రాజకీయాలకు పాల్పడం, మీలాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడం ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారిని ఒక్కటే కోరుతున్నా మీరు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి జనసైనికులపై జనసేన నాయకులపై ఒత్తిడి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరింపులకి దిగుతా ఉంటే మేమైతే చూస్తా ఊరుకోం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకానికి డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి ఇంటికి పంపిస్తాం. ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్న మీ కార్యకర్తలు అందరిని కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఐదు సంవత్సరాలు కాల పరిమితి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఏదైనా ఉంటే అభివృద్ధి వైపు అడుగులు వేయండి తప్ప కక్ష సాధింపు చర్యలు చేసి బ్రిటిష్ వారి పరిపాలన తీసుకురావద్దు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్ మండల కార్యదర్శి శ్రీహరి ముతుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అక్బర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.