దాసరి కిరణ్ తో జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

టివి డిబేట్లలో ప్రత్యర్ధులకు తనదైన శైలిలో సమాధానం చెప్తూ, ఎందరో జనసేన నాయకులకు మరియు జనసైనికులకు ప్రేరణనిచ్చే జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ తో జె.ఎస్.పి గ్లోబల్ టీం(ప్రపంచ ఎన్నారై కలయిక) శనివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం ఫౌండర్ సురేష్ వరికూటి అండ్ టీం అధ్వర్యంలో జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 24 అసెంబ్లీ జనసేన సీట్ల గురించి ఎన్నారై జనసైనికులు మరియు వీరమహిళలు వారి వారి భావాలను పంచుకోవడం జరిగింది. దాసరి కిరణ్ చాలా చక్కగా మోటివేట్ చేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేస్తున్నానని వారి పాప భవిష్యత్తు కోసం మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసిపి అమలు చేద్దామనుకుంటున్న ల్యాండ్ టైటిల్ ఆక్ట్ గురించి వివరించడం జరిగింది. అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమే పొత్తు అని, పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లను తీసుకుందని, అందరూ కష్టపడి పనిచేసి అసెంబ్లీకి జనసేనను 100% గెలిపిచి పంపించాలని చెప్పడం జరిగింది. జనముద్ర ద్వారా జనసేన పార్టీకి సేవ చేసే అనేకమన్ది సైనికులను తయారు చేయాలని, అందరు సమిష్టిగా కృషి చేసి జనసేన-టిడిపి గెలుపు సాధించాలని ఆకాంక్షించారు. జనసేనకు ఎన్నో విధాలుగా సేవలందిస్తున్న ఎన్నారైలను కొనియాడడం జరిగింది. ఎన్నారైలకు రానున్న ఎన్నికలలో ఏ విధంగా పని చేయాలి అని పలు అంశాలను వివరించడం జరిగింది. ఎన్నారైల నుండి కూడా గళాన్ని వినిపించేలా పనిచేయాలని దానికి అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 3 గంటల పైన జరిగిన ఈ సమావేశంలో గ్లోబల్ గా ఉన్న 28 దేశాల నుండి 60కి పైగా ఎన్నారై జనసైనికులు మరియు వీరమహిళలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.