పొక్కునూరులో పల్లె పధాన జనసేన

జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం పల్లె పధాన జనసేన కార్యక్రమంలో భాగంగా నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పొక్కునూరు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు. చాలా కాలంగా పొక్కునూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అనుకొని ఉన్న బావిని సందర్శించారు. పాఠశాలకు ఆనుకొని ఉన్న బావికి ఎటువంటి గ్రిల్ లాంటివి లేకుండా ఉండటం వల్ల పాఠశాలలోని పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు రమాదేవికి చెప్పి వాపోయారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ త్వరలో ఈ విషయాన్ని సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యకు పరిస్కార దిశగా ప్రయత్నం చేస్తానని గ్రామస్థులకి మాట ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం జనసేన-టీడీపి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్యకి ఓటు వేసి గెలిపించి నందిగామలోని ప్రతి గ్రామం అభివృద్ధికి మీ వంతు కృషి మీరు కూడా చెయ్యాలని వారికి తెలియచేశారు. అదే గ్రామానికి చెందిన ఒక మహిళ గతవారం జనసేన కండువా కప్పుకున్నందుకు ఆమెపై అక్రమంగా మద్యం అమ్ముతోందని రాత్రి ఆ మహిళను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళారని రమాదేవి ముందు కంటతడి పెట్టింది. ఆమెను రమాదేవి ఓదార్చి వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం చేస్తున్న దాస్టికాలకు ముగింపు వచ్చే ఎన్నికల తరువాత జరుగుతుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, కుడుపుగంటి రామారావు, మండల ఉపాధ్యక్షుడు పురంశెట్టి నాగేంద్ర, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మణికంఠ, వెంకట నరసమ్మ, పవన్ ఆర్మీ టీం, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.