జనసేన తెలుగుదేశం పొత్తు గెలవాలి

  • ఇక యుద్ధం మొదలైంది
  • వైసిపి మాయలో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి

పిఠాపురం: పిఠాపురంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సీటు ఎవరికిచ్చినా మీరందరూ గెలిపించాలని ఆదివారం ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాడ కొత్తపళ్లి మండలం పాత ఇసుకపల్లి బిసి మహిళలకు భరోసా కల్పించిన జనసేన నాయకులు పాత ఇసుకపల్లిలో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని బాధితులు వాపోయారు. మాకు పథకాల కంటే మా పిల్లలు భవిష్యత్తు మాకు ముఖ్యమని అది ఒక్క తెలుగుదేశం జనసేనతోటే సాధ్యమని మాకు అర్థమవుతుందని మహిళలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను, టైల్స్ బాబీ, ముప్పున రత్నం, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.