ఆదివాసిలలో ఏ తెగకు అన్యాయం జరిగినా ఊరుకోం

  • జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్

పాడేరు: ఆదివాసిలలో యేతెగకు అన్యాయం జరిగినా ఊరుకోం అని జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్(ఎల్ ఎల్ బి) పేర్కొన్నారు..వాల్మీకి సామాజికర్గానికి వెబ్ సైట్లో లేకుండా చేయడం వెనుక ఆంతర్యమేమిటో, వైసీపీ ప్రభుత్వం వాల్మీకి సామాజిక వర్గానికి సమాధానం చెప్పండి, తరతరాల నుండి గిరిజనతెగలోఉంది, మిగతా తెగల వారు కలసిమెలసిఉన్న ఆదివాసీల ఐక్యతను, దెబ్బతీసేందుకు ఈ కుట్ర చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నాం, దీనికి గల పరమార్థాన్ని సత్వరమే అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధ్యత ఉన్న ఆదివాసిగా సాటి ఆదివాసి తెగకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని చెప్పారు. బీసీ కులాలకు చెందిన, బోయావాల్మికి, బెంతో ఒరియాలను, ఎస్ టి జాబితాలో చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకుని కుస్తీ పడుతున్న మీరు, అనాదిగా గిరిజన తెగలలో ఉన్న వాల్మీకి తెగనుఎంకారణం చేత వెబ్ సైట్లోతొలగించారో సమాధానం చెప్పాలి. దీని మేము తీవ్రంగా కండిస్తున్నాం, సత్వరమేవెబ్ సైట్లో చేర్చాలి లేదంటే ఉద్యమం చేయకతప్పదని హెచ్చరించారు.