ఘనంగా ఆరుట్ల లోక్మంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

జనగామ: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాసేవకుడు, అందరి ఆపదలు తన ఆపదగా భావించి సేవ చేసే మన జనగామ ముద్దుబిడ్డ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకుడు ఆరుట్ల లోక్మంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో గుడిసె వాసులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్యక్షులు జోగు భాస్కర్, ఇటికల శంకర్, అశోక్ యాదవ్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, సాయి, మను, ఉదయ్, తాళ్ల శివ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.