మత్స్యకారులకు న్యాయం చేయాలని జనసేన వినతి

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు జనసేన నాయకుడు ఆకుల శ్రీనివాస్ అఖిలపక్ష నాయకులతో కలిసి జిల్లా కలెక్టరు కార్యాలయములో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులకు న్యాయం చేయమని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకుల శ్రీనివాస్ జిల్లా కలెక్టరుకి వినతిపత్రాన్ని అందచేసి స్థానిక మత్స్యకారులకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకుని కుటుంబాలని పోషించుకుంటూ జీవిస్తున్నారని, రకరకాల కారణాలతో వీరికి అన్యాయం జరుగుతోందని అందులో ఒకటి వీరిని సముద్రంలో వేటకి కొన్ని ప్రాంతాలకి వెళ్ళకుండా నిరోధించడం, వీరి వలలను కోసేయడం, చమురు సంస్థలు వీరికి నష్టపరిహారాన్ని అందరికీ ఇవ్వకుండా అరకొరగా కొంతమందికి ఇవ్వడంలాంటివన్నారు. ఇంకా వేట నిషేధంలో కూడా లబ్దిదారుల జాబితాలోంచి రకరకాల కారణాలతో వీరి పొట్టకొడుతున్నారన్నారు. అధికారులు వీరి ఆందోళనపై దృష్టిసారించి తగుచర్యలు తీసుకుని న్యాయం చేయాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తొందనీ, వీరికి న్యాయం జరిగేదాకా ముత్తా శశిధర్ నాయకత్వంలో పోరాటం చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.