జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు: ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు గోదావరి జోనల్ కన్వీనర్ తలాటం సత్య ఆధ్వర్యంలో జగనన్న పాపాలు అనే కార్యక్రమం 35వ డివిజన్ నూకాలమ్మ గుడి వద్ద జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ 2019-24 మధ్యకాలం 60 నెలలలో జగన్మోహన్ రెడ్డి పాలన రాష్త్రంలో ఎలా జరిగిందో చూసి ప్రజలు భయబ్రాంతులు అవుతున్నారన్నారు. సంక్షేమ పధకాలు ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవమే అని ఒకటవ తేదీన కాకినాడలో పెన్షన్లు వగైరా సంక్షేమ పధకాల పేరుతో వేలాదిమందికి పంపిణీ జరిగింది సంతోషమే అనీ, కానీ ఈప్రాంతంలో ఉంటున్న మధ్యతరగతి ప్రజలు మాకష్టంతో ప్రభుత్వం వేస్తున్న అధిక పన్నులని చెల్లిస్తూ జీవిస్తున్న మాకు ఏలాంటి సంక్షేమ పధకాలు అందవనీ కానీ ఏరకంగా నష్టపోతున్నామో అని భయపడుతూ ఆందోళన చెందుతున్నారనీ, కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను, ఆస్తుల రెజిస్ట్రేషన్ చార్జీలు, ఆర్టీసి బస్ చార్జీలు, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండరు ధర, పెట్రోల్, డీజిల్ పై అదనపుబాదుడు, వాహనాలపై హరిత పన్ను ఇవన్నీ పన్నులు అదనంగా పెంచి ముక్కుపిండి వసూలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన పాపానికి అనుభవిస్తున్నామనుకుంటున్నారన్నారు. జగనన్న చేసిన పాపానికి మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారన్నారు. తాము ప్రతి ఇంటికీ వెల్లి తాము చెప్పిన వాటిలో ఏఒక్కటి తగ్గిందన్నా మాట భేషరుతుగా వెనక్కి తీసుకుంటామన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఇంతటి కష్టాన్ని అనుభవిస్తున్నామనీ మరొక్కసారి ఇలాంటి పొరపాటు చెయొద్దని మనవి చేస్తున్నామన్నారు. జనసైనికులు ఈ 21 రోజులూ నిరంతరం ప్రజలని చైతన్యపరచి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీల ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, మనోహర్, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, ఏసుబాబు, శంకర్, పెద్దిరెడ్డి భాస్కర్, దుర్గాప్రసాద్, దారపు సతీష్, వంశీ, అగ్రహారం సతీష్, నగేష్, సాంబశివ, వాశిరెడ్డి సుబ్బారావు, అడబాల రాజేంద్రప్రసాద్, మరియా, హైమావతి, చోడిపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.