రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 31వ డివిజన్ లో సోమవారం 44వరోజు మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలతో మమేకమై మాట్లాడుతూ జగన్ మాయమాటలు నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం 30 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందని కనుక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్నిరంగాలు పురోగమించాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యమవుతుందని జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపాడని యువతకు ఉద్యోగాలు కూడా లేవని కనుక ప్రతి ఒక్కరూ జనసేన-టీడీపీ పార్టీలకే ఓటు వేయాలని కోరుతూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు 20లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరిస్తూ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వీటితో పాటు స్థానిక డివిజన్ లో మంచినీటి సరఫర, వీధిదీపాలు, మురుగుకాలువలు రహదారులు సరిగా లేవని అన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి టీడీపీ జిల్లా డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి మారుతి గౌడ్, టీడీపీ డివిజన్ నాయకుడు దాడితోట సూరి, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.