కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు సహకరిస్తుంది

డి రావులపాలెం: కాపు సంక్షేమ సేన కోనసీమ జిల్లా అధ్యక్షులు తిక్క శేషు బాబు గారి ఆధ్వర్యంలో డి రావులపాలెం గ్రామంలో కాపు సంక్షేమ సేన కార్యాలయములో సోమవారం జరిగిన సమావేశంలో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చేగొండి వెంకట హరి రామజోగయ్య గారి కాపు సంక్షేమ సేన మనుగడ ఉన్నంతకాలం జనసేన వెంటే కాపు సంక్షేమ సేన ఉంటుందని జనసేన ఆశయాలు కోసం పూర్తిస్థాయిలో కాపు సంక్షేమ సేన పనిచేస్తుందని చేగొండి హరి రామజోగయ్య గారి ఆశయాలు మేరకు జనసేన కోసమే కాపు సంక్షేమ సేన పుట్టినందున మరింత బలమైన శక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సాధనకు మనస్ఫూర్తిగా సహకరిస్తుందని ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కాపు సంక్షేమ సేన సోదర సోదరీమణులకు సభ్యులకు తెలియజేసారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బసవ సూర్య ప్రకాశం (చినబాబు) కోనసీమ జిల్లా అధ్యక్షులు తిక్క శేషు బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి బాబులు, నూకల సూర్య ప్రకాష్, జనసేన నాయకులు డి రావులపాలెం, సర్పంచ్ ఉండ్రు భగవాన్ దాస్, కాపు సంక్షేమ సేన జిల్లా ఉపాధ్యక్షులు నల్లా రెడ్డి నాయుడు, కాపు సంక్షేమ సేన సభ్యులు అడబాల నాగేశ్వరరావు.