జనసేన ఆశయ సాధన సభ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు

  • ముత్తుకూరు మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి

సోమవారం: ముత్తుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్తుకూరు మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ.. ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు సెంటర్ లో నిర్వహించిన జనసేన ఆశయ సాధన సభ విజయవంతంగా జరిగింది. ఈ సభ నిర్వహణకు ఎంతో భరోసాగా నిలిచి, కార్యక్రమ విజయానికి ఎంతో తోడ్పాటు అందించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ బోనుబోయిన ప్రసాద్ యాదవ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. వారి కృషితోనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. కార్యక్రమ అతిధులు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, నెల్లూరు సిటీ ఇంచార్జ్ దుగ్గిశెట్టి సుజాయ్, పార్టీ ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి ప్రసాద్, మరియు సర్వేపల్లి నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈ బహిరంగ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి జనసేన ముత్తుకూరు మండల కమిటీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పల్లపు వీరబాబు, మండల ప్రధాన కార్యదర్సులు చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు, మండల మండల సంయుక్త కార్యదర్సులు పురిణి అంజి, కాళహస్తి గిరిధర్ పాల్గొన్నారు.