వంచ‌న‌తో మోస‌పూరిత హామీల‌తో కొన‌సాగిన జ‌గ‌న్ పాల‌న‌!

  • టీడీపీ-జ‌న‌సేన విజ‌యంతోనే స్వ‌ర్ణ‌పాల‌న‌కు నాంది
  • బొప్పూడిలో టీడీపీ-జ‌న‌సేన విద్యుత్ ప్ర‌భ‌కు పూజ‌లు
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: వంచ‌న‌తోనో.. మోస‌పూరిత హామీల‌తో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఐదేళ్ల పాల‌న కొన‌సాగింద‌ని అందుకే మ‌రోసారి మోస‌పోవ‌టానికి ప్ర‌జ‌లు సిద్దంగా లేర‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ తెలిపారు. గురువారం ఆయ‌న మండ‌లంలోని బొప్పూడి గ్రామంలో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్బంగా కోట‌ప్ప‌కొండ‌కు త‌ర‌లివెళ్లేందుకు నిర్మించిన టీడీపీ-జ‌న‌సేన విద్యుత్ ప్ర‌భ‌కు పూజ‌లు నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కుల కోల‌హాలం మ‌ధ్య ప్ర‌భతో పాటు కొంత దూరం ప్ర‌యాణించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, జ‌న‌సేనికుల‌కు ఆయ‌న మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పవిత్రమైన శివరాత్రి చుట్టూ ఉన్న చీకటిని , సమస్యలన్నింటినీ పోగొట్టి జీవితాల‌లో సానుకూలతను నింపాలని ఆకాంక్షించారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌భ‌ల‌కు పెట్టింది పేర‌ని, ఆధ్యాత్మిక శోభ‌తో, ఆనందోత్స‌వాల మ‌ధ్య వేడుక‌గా కోట‌ప్ప‌కొండ‌కు త‌ర‌లివెళ్ల‌డం ఆనవాయితీ అని తెలిపారు.
రానున్న ఎన్నిక‌ల‌కు స‌మాయుత్తం కావాలి
టీడీపీ-జ‌న‌సేన కుట‌మి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడి, రానున్న ఎన్నికలకు నేటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జ‌గన్ పాల‌న కాలంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వంచ‌న‌కు గుర‌య్యార‌ని వివ‌రించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువ‌త త‌మ భ‌విష్య‌త్తును కోల్పొయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని ఊరించి తీరా ఎన్నిక‌ల‌కు ముందు కేవ‌లం 6వేల పోస్టుల భ‌ర్తీకి మాత్ర‌మే నోటిఫికేష‌న్ జారీ చేయ‌డంతో జ‌గ‌న్ చిత్త‌శుద్ది ఏపాటిదో అర్ధం అవుతుంద‌ని మండిప‌డ్డారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప‌థ‌కాలు ర‌ద్దు చేసి వారి జీవితాల‌తో చెల‌గాట‌మాడార‌ని, ఉట్టి మాట‌ల‌తోనే ఐదు సంవ‌త్స‌రాల కాలం పూర్తిచేసుకోనున్నార‌ని ఆరోపించారు. రానున్న‌ది స్వ‌ర్ణ‌పాల‌న‌.. రాష్ట్రంలో జగన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించి టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకు స్వర్ణమయమైన పాలనను అందించేందుకు ఇరు పార్టీలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.ప్ర‌తి నాయ‌కుడు, కార్య‌క‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలోచ‌న‌లు, ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల్లో తీసుకువెళ్ల‌టానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌లతో మ‌మేక‌మై ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సంసిద్దం కావాల‌ని కోరారు. వైసీపీ దుర్మ‌ర్గ పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌ను విమూక్తి క‌లిగించ‌టానికి గ‌డిచిన ఐదేళ్ల పాటు శ్ర‌మించిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌, నాయ‌కులు మ‌రి కొన్ని రోజులు క‌ష్ట‌ప‌డితే అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించుకోగ‌ల‌మ‌ని తెలిపారు.