జనసేన-టిడిపి-బిజేపి ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం బైపాస్ లో ఉన్న పద్మప్రియ కళ్యాణ మండపంలో ఉమ్మడి కడప జిల్లా ముస్లిం జనసైన్యం (ఎం.జె.ఎస్) వారి ఆద్వర్యంలో జనసేన-టిడిపి-బిజేపి ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాన్, అధికార ప్రతినిధి కీర్తన, రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు, ఎన్నారై యర్రంశెట్టి హరిబాబు రాయల్, మరియు టిడిపి నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి, బిజేపి నాయకులు షబ్బీర్ అహ్మద్, నాసర్ ఖాన్ లు ముఖ్య అతిధిలుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఆన్ని విధాలుగా ఎదగాలని వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని రాజంపేట జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అలి షేక్ అతిధులను శాలవాలతో సత్కరించారు. ఈ కర్యక్రమాన్ని గౌస్ లాజం, కరిముల్లా, ఇమ్రాన్, సిరాజ్, అబ్దుల్లా, కమాల్ బాష, సలీం, మహబూబ్ బాష, లతీఫ్, మస్తాన్, హుస్సేన్, పఠాన్ నిర్వ్హించారు. ఈ కార్యక్రమంలో సలీం, కటారు బాబు, మౌల, ఆకుల చలపతి, పత్తి వెంకటసుబ్బయ్య, గురివిగారి వాసు, కోలాటం హరికృష్ణ, భారతాల ప్రశాంత్, అబ్బిగారి గోపాల్, పలుకూరి శంకర్, రాజా ఆచారి, రాజేష్ వర్మ, సాయిరాజు, శివశంకర్ రాజు, సలీం , ఖాజ తదితరులు పాల్గొన్నారు.