బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలేకి ఘననివాళి

తాడేపల్లిగూడెం, చదువుల తల్లి సరస్వతి సావిత్రి భాయి ఫూలే వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు సందాక రమణ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అద్యక్షులు కేశవభట్ల విజయ్ కుమార్ హాజరు అయ్యారు. బీసీ సంక్షేమ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్ మాట్లాడుతు అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి, మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మొదటి మహిళ సంస్కర్త సావిత్రి భాయిపూలే అని ఈరోజు దేశంలో మహిళలు విద్యా, ఉద్యోగ, రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే అందుకు కారణం సావిత్రి బాయిఫూలే అన్నారు. విద్యతో పాటు సమాజంలో ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప మహిళా సంఘ సంస్కర్త సావిత్రి బాయిఫూలే అని అన్నారు . నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న మాట్లాడుతు విద్యతో పాటు మహిళా అభివృద్ధికి మరియు ఈ దేశంలో 85 శాతం పైగా ఉన్న బహుజనుల విద్యకి తన జీవితన్ని త్యాగం చేసిన మొదటి మహిళా సంస్కర్త సావిత్రి బాయిఫూలే అని ఈరోజు దేశంలో మహిళలు విద్యకి, ఎంతో కృషి చేసిన మహనీయురాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బర్నికల సూర్యనారాయణ వియ్యపు వియ్యపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.