అగ్నిప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన డా.రాపాక రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, పొన్నమండ గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో కోరుకొండ వెంకటేశ్వరరావు ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు సందర్శించి కోరుకొండ వెంకటేశ్వరరావు కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాపాక మహేష్, కుసుమ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.