వైసిపి ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది: గునుకుల కిషోర్

నెల్లూరు, 30వ డివిజన్లో స్కూలుకు ముందు గల రోడ్ల ఆవశ్యకతను తెలుసుకొని తక్షణమే సాంక్షన్ చేసిన కమిషనర్ గారికి కృతజ్ఞతలు అంటూ నెల్లూరు రూరల్ 30వ డివిజన్ వైయస్సార్ నగర్ లో కనీసం స్కూల్ ముందైనా రోడ్లు వేయండి అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సోమవారం మున్సిపల్ కమిషనర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా నెల్లూరు రూరల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది 1000 కోట్లు ఖర్చుతో అభివృద్ధి సాధిస్తున్నామని మీడియాలో ప్రసంగిస్తున్న నెల్లూరు రూరల్ అభ్యర్థి, నెల్లూరు ఎంపీ గ్రామాల సంగతి సరాసరి కార్పొరోషన్ పరిధిలోని 30 డివిజన్లో 15 సంవత్సరాలుగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
కార్పొరేషన్ లిమిట్లో ఉన్న వాటినే పట్టించుకోకపోతే రెండు సంవత్సరాల నుంచి వీటి గురించి ప్రస్థావిస్తే కార్పొరేషన్ లో అడిగితే రోడ్లు వేయడానికి నిధులు లేవని తెలుసుకోండి చెప్పారు. మరి మీరేమో 1000 కోట్ల ఫండుతో అభివృద్ధిని సాధిస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. సోమవారం కమిషనర్ వెంటనే స్పందించి స్కూలు ఇరువైపులా ఉన్న రోడ్లను తక్షణమే సాంక్షన్ చేయడం చేశారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నగరంలో నాలుగు మూలల్లో ఎక్కడ అడిగినా కూడా నారాయణ గారు వేసిన రోడ్లు, అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చు. దోమలు లేని నెల్లూరు నగరం నేర్పిస్తానని ముందుకు నడుస్తున్న నారాయణని గెలిపించాలి. వారి హయాంలో వేసిన రోడ్లు తప్ప ఒక ఏరియాలో కూడా వేయని దుస్థితి. మంచి ఆలోచన కలిగిన మచ్చలేని వ్యక్తులైన నెల్లూరు సిటీ నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా ప్రభుత్వం తరఫున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్త చేసారో వీరిని చూస్తేనే అర్థమవుతుంది. అదే విధంగా నెల్లూరు సిటీలోనే అక్కడక్కడ ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఆలోచన లేకుండా సైడ్ కాలవలో నిర్మాణం జరగకుండా హడావిడిగా జరుగుతున్నాయి వాటిని కూడా పరివేక్షించమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. మాటలకే పరిమితమైన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి ప్రజాసమస్యలు తీర్చగల నాయకులను ఎన్నుకొని ప్రజా ప్రభుత్వాన్ని గెలుపొందించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సిటీ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, జిల్లా కార్యదర్శి సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, 30వ డివిజన్ నాయకులు శ్రీను, కేశవ, మౌనిష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.