కెనడాలో ఘనంగా జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కెనడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అశయాలను అర్ధం చేసుకుంటూ ఎప్పుడూ జనసేనాని వెంటే నడిచే కెనడా జనసేన టీం 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే వారంతంలో మార్చి 9వ తారీఖున టొరొంటో మరియు వాంకోవర్ నగరాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసెన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు సాగిన కెనడా జనసేన టీం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ 2024 ఎన్నికలకి మరింత బలంగా జనసేన పార్టీకి అండగా నిలబడాలి అని నిర్ణయంతీసుకున్నారు. ఎవరితో పొత్తులు, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించారు అనే దానికంటే రాష్త్రానికి మంచి జరగాలి అనే జనసేనాని వ్యూహమే మాకు ముఖ్యం, మా భవిష్యత్ మాత్రమే మాకు ముఖ్యం అని ముక్త కంఠంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే మా అడుగులు అని ప్రమాణం చేసారు. ఈసారి ఎన్నికలకు ప్రత్యర్ధి పార్టీలు సిద్ధం అని ప్రకటిస్తే, ఈ అవినీతి రాక్షస ప్రభుత్వాలను ఎదుర్కొనడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధం అని కెనడా జనసేన టీం నిర్ణయించుకున్నారు.