బొర్రారెడ్డిపై పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి: ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం, తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామ పంచాయితీ కందల్లపల్లి గ్రామ జనసేన కార్యకర్త అప్పాల బ్రహ్మతేజ కుమార్ నాయుడు ప్రభుత్వ పధకాలు లబ్ధి పొందుతున్నాడనే అక్కసుతో అతని భార్యను, కుటుంబాన్ని, కులాన్ని తీవ్రంగా దూషిస్తూ ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన వైసీపీ సర్పంచ్ గాయం శ్రీనివాసరెడ్డి అలియాస్ బొర్రారెడ్డిపై పోలీసులు వెంటనే తగిన చర్య తీసుకోవాలని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తెలియజేయడం జరిగింది. అలాగే ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు జనసేన కార్యకర్త అప్పాల బ్రహ్మతేజ కుమార్ ని పరామర్శించిన ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు ఆవుల వెంకట్, పోతలపాడు గ్రామ జనసేన నాయకులు నాగూల్ మీరా మరియు మార్కాపురం జనసేన నాయకులు.