కాకినాడ సిటిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కాకినాడ సిటి, 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ సిటిలో పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ 43 వార్డు అధ్యక్షులు, ఆకుల శ్రీనివాస్ 39 వ వార్డు అధ్యక్షులు సంయుక్త ఆధ్వర్యంలో పార్టీ జెండాని ఎగురవేసి, కేక్ కటింగ్ చేసుకుని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ రాబోయే నెలరోజులూ చాలా విలువైనవనీ అధికార వై.ఎస్.ఆర్ పార్టీ ఎన్నో కుట్రలూ, కుతంత్రాలు చేసి ఎలాగైనా ఎన్నికలలో నెగ్గాలని పన్నాగాలు పన్నుతుందనీ వాటన్నిటినీ కలిసికట్టుగా ఎదుర్కొని తిప్పికొట్టాలనీ, కూటమి ఎన్నికల హామీలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడతామని ప్రతిఙ్ఞ్గ్య చేసారు. అనంతరం సిటి కార్యదర్శి లోవరాజు ఆధ్వర్యంలో వీరమహిళలకి సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, అడబాల రాజేంద్రప్రసాద్, పెద్దిరెడ్డి భాస్కర్, వంశీ, ఎస్.కే. సమీర్, ఆదినారాయణ, మౌనిక్, మనోహర్ లాల్ గుప్తా, నకిలా సతీష్, మోస ఏసేబు, వాసిరెడ్డి సుబ్బారావు, వాసిరెడ్డి కుమార్, అగ్రహారపు సతీష్, గంగాధర్ సాధనాల, కంటా రవిశంకర్, పచ్చిపాల మధు, కోడి శ్రీను, జంపా రమణ,మండపాక దుర్గాప్రసాద్, ముత్యాల దుర్గాప్రసాద్, బుల్లెట్ శ్రీను, టి.వి.వి సత్యనారాయణ, వీర మహిళలు మరియా, సుజాత, హైమావతి, రచ్చ ధనలక్ష్మి, రమణమ్మ, ఉమా, చోడిపల్లి సత్యవతి, రమ్య, దీప్తి, మావులూరి రాగిణి తదితరులు పాల్గొన్నారు.