సామాన్యులకు కొండంత అండ జనసేన జెండా

  • జనసేన ఆవిర్భావం దేశ రాజకీయాల్లో ఓ చారిత్రాత్మకం
  • యువ నాయకులకు ఘనమైన వేదిక జనసేన
  • 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి
  • సామాన్యులకు కొండంత అండ జనసేన జెండా అని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు.

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావం ఓ చారిత్రాత్మకమని ఆయన అన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 22వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద జెండా వేడుకలు నిర్వహించారు. తొలుత జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి.. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ గొప్ప సైద్ధాంతిక బలం, పవన్ కల్యాణ్ భావజాల పునాదిపై జనసేన నిర్మానమైందన్నారు. పాలకుల అవినీతిపై, ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రజాధన దోపిడీపై జనసేన నిరంతర పోరాటం సాగించిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై క్షేత్రస్థాయిలో ప్రజా గొంతుకై నినదించిందన్నారు. అణగారిన వర్గాల వారికీ తాడిత పీడిత వర్గాలకు జనసేన జెండా కొండంత ధైర్యాన్నిచ్చిందన్నారు. అవినీతి, బంధుప్రీతి, కుల మతాలతో అంటకాగుతున్న నేటి రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొచ్చి స్వచ్ఛమైన రాజకీయాలను నెలకొల్పాలన్న ద్యేయంతో ముందుకు సాగుతుందన్నారు. ప్రజా పోరాటాలతో జనసేన పార్టీ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేపిస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికల్లో ఎంతోమందిని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా గెలిపించారని కొనియాడారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు సామాన్యులు కూడా రాజకీయాల్లో రాణించవచ్చని నిరూపించిన పార్టీ జనసేన అంటూ కొనియాడారు. సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తి ఉన్న ఎంతోమంది యువ నాయకులను తయారు చేసిన నాయకుడిగా పవన్ కల్యాణ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రస్తుత వైసీపీ దూరాగతాల, అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పవన్ కల్యాణ్ రాజకీయ యజ్ఞం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్, మెహబూబ్ బాషా, తాడివాక రమణ, కోలా అంజి, షేక్ ఆదాం, నాజర్, నండూరి స్వామి, ఎర్రబోతు శ్రీను, కోలా మల్లి, జాబా శంకర్, శెట్టి శ్రీను, చిరంజీవి, మస్తాన్ వలి, రాంబాబు, స్టూడియో బాలాజీ బియ్యం శ్రీను, కుమారస్వామి, గంటా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.