కనిగిరిలో జనసేన జెండా ఆవిష్కరించిన వరికూటి నాగరాజు

కనిగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జనసేన పార్టీ కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జనసేన-టిడిపి కమిటీ మెంబర్ – రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు సభను ఉద్దేశించి మాట్లాడారు. మనందరం కలిసి ఐక్యమత్యంతో నడవవలసిన సమయం ఆసన్నమైనదన్నారు తదుపరి కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో అవినీతి పాలన ఎక్కువైందని ఈ జగన్ సైకో పాలన అంతమొందించే రోజులు దగ్గర ఉన్నాయని అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తల మీద కొన్ని లక్షల అప్పు పెట్టారని రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్లకు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు మరియు రాక్షస పాలన అంతమొందించడానికి దేవతలు ఎలా అయితే పురాణాలలో ఉన్నారో నేడు ఈ సైకో జగన్ పాలన అంతమోదించడానికి జనసేన టిడిపి బిజెపి కూటమి ఉందని ప్రతి ఒక్కరు కూటమికి మద్దతు తెలపాలని కోరారు అలాగే కనిగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్ధి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తదుపరి అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు తదుపరి పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో మాట మంత్రి కార్యక్రమాలు జరిగింది మాట మంతిలో జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి, పామూరు మండలం అధ్యక్షులు ఏడుకొండలు, ఇమ్రాన్, కోటం శెట్టి మధు ముత్యాల నరేష్, ఇమ్రాన్ బాషా, సాయి కిషోర్, అంజి నాయుడు, రవీంద్ర తమ్మిశెట్టి, ఓబులేష్, వంశీకృష్ణ, పామూరు మండల జనసైనికులు మరియు కనిగిరి నియోజకవర్గ జనసైనికులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.