APSSDC ద్వారా DECCAN FINE CHEMICALS INDIA PVT LTD ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో సారి శుభవార్త చెప్పింది. Deccan Fine Chemicals (India) Pvt Ltdలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రొడక్షన్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 6న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ(B.Sc Chemistry) చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. 2016 – 2020 ఏళ్ల మధ్య పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,660 వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేయాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
@AP_Skill Collaborated with Deccan Fine Chemicals (India) Pvt Ltd, to Conduct #ICSTP Program.
— AP Skill Development (@AP_Skill) March 4, 2021
Registration Link: https://t.co/K2eBuec4MY
Contact: Mr.Siva Rama Krishna – 9010737998
Mr.Perumallarao – 7386706272
APSSDC Helpline 1800 425 2422 pic.twitter.com/x4HTvhJMqD
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ‘రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్, రమణయ్యపేట, నియర్ సర్పవరం జంక్షన్, ఎస్ఆర్ఎంటీ బ్యాక్ సైడ్, కాకినాడ – 533005’ చిరునామాలో ఈ నెల 6న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 9010737998 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.