పత్తికొండలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పత్తికొండ, జనసేన పార్టీ కార్యాలయం పత్తికొండ నందు సీజ రాజశేఖర్ ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం అవతరించిన పార్టీ జనసేనపార్టీ ముందుగా కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేయడం జరిగింది. అనంతరం పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త సిజి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపేరునా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎదురు తిరిగితే బతుకుతామా అనుకునే సామాన్యులకు ప్రశ్నించే దైర్యం, ప్రశ్నించడానికి జనసేన పార్టీ అనే ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చి, నాలాంటి కొన్ని లక్షల మంది యువతను రాజకీయాలులోకి వచ్చే విధంగా చేసి, రాజకీయమంటే దోచుకోవడం దాచుకోవడం కాదు. సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాలునీ ఎదిరించి, ప్రజలకు అందవలసిన హక్కులను నిష్పక్షపాతంగా, నిస్వార్ధంగా వాళ్లకు అందే విధంగా పనిచేయడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని, నిజాయితీగా సమాజ సేవ కోసమే రాజకీయాలు చేయాలని, సరికొత్త రాజకీయ విధానాన్ని తీసుకొచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు. రాష్ట్ర సంక్షేమం ప్రజాశ్రేయస్సు ప్రజల పక్షాన బలంగా నిలబడడానికి ఏర్పడిన పార్టీనే జనసేన పార్టీ అని పార్టీ అవిర్భవించి ఒక దశాబ్దం పూర్తి ఔతుందని ఈ 10సంవత్సారాల కాలంలో అనేక ప్రజా పోరాటాలు, సేవా కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల మన్నలను పొందుతున్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ ఎటు వంటి తన వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా పార్టీని స్థాపించి తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేశారని ఆయన అడుగుజాడలలో నడుస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీది ప్రధాన మైన భూమిక ఉంటుందని అన్నారు. మన అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయానికి మనమంతా కట్టుబడి పని చేద్దామని, పొత్తులో భాగంగా మన నియోజకవర్గంలో టిడిపి కేటాయించడం వలన, మనం ఇక్కడ పోటీ చేయలేకపోతున్నాం, అని చిన్న బాధ ఉన్నప్పటికీ ఏదేమైనా పత్తికొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఈ శ్యామ్ కుమార్ గారి గెలుపు కోసం మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి గెలిపించుకునే పూర్తి బాధ్యత మన పై కూడా ఉన్నది కావున, ఏదేమైనా పొత్తులో భాగంగా శ్యామ్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించుకొని మిత్రపక్షం అంటే ఏమిటో చూపిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, వడ్డే విరేష్, ఇస్మాయిల్, నాగార్జున, సుధాకర్, రాజు, అజయ్ ,మాభాష, విజయ్, నాయుడు, నరేంద్ర, అభిరామ్, ఈశ్వరయ్య, రాజశేఖర్, ధను, మొదలగు వారు పాల్గొని విజయవంతం చేశారు.