జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు

నెల్లూరు: ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పోతురాజు టోనీ బాబు నెల్లూరు నగరంలో టౌన్ హాల్ నందు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సబందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీలో ఉన్న వైసీపీ కోవర్టులను బయటకు తరుముతాం అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైసీపీ లేదన్నారు. జనసేన+టీడీపీ+బీజేపీ కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ తెచ్చే విధంగా జనసేన పార్టీ పని చేస్తుంది అని హామీ ఇచ్చారు. పి.ఎస్.పి.కె స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరిట నెల్లూరు నగరం, 4000 వేలు, నెల్లూరు రూరల్ లో 3000 వేల పవన్ కళ్యాణ్ అభిమానులను వారి కుటుంబ సభ్యులను కలిసి కూటమికి మద్దతు పలికే విధంగా తయారు చేశాం అన్నారు. బడుగు బలహీనర్గాలకు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఫలాలు అందనున్నాయి అని తెలియజేశారు. 6 రోజుల్లో నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం, జనసేన పార్టీ నాయకులు, వీరమహిలతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో టీడీపీ+జనసేన+ బీజేపీ పరిచయ వేదిక నిర్వహించబోతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. షేక్ షానవాజ్, సుధాకర్, శ్రీనివాసులు, రాము, కాకి శివ, వీరమహిళ లక్ష్మి, సుజాత తదితరలు పాల్గొన్నారు.