రాజోలు జనసేన జెండా ఎగరాలి: డాక్టర్ రాపాక రమేష్ బాబు

రాజోలు, రాష్ట్రంలో జనసేనపార్టీ ఉన్నంతకాలం జనసేనపార్టీలొనే కొనసాగుతానని, పదవులతో ప్రమేయ లేకుండా ఒక జనసైనికుడిగా పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తా అని, మీ అందరి సహకారంతో పార్టీలో సేవకార్యక్రమాలు చేస్తూ, పార్టీని గాజు గ్లాస్ సింబల్ ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడానికి మీరు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని, రాజోలు నియోజకవర్గంలో జనసేన-టిడిపి-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ని గెలిపించి, పార్టీ అధ్యక్షులు పవన కళ్యాణ్ కి బహుమతిగా ఇస్తామని డాక్టర్ రమేష్ బాబు తెలియజేశారు. తమ ద్వారా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా తెలిసిన వెంటనే అండగా ఉంటామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ నాయకులు, జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం, గ్రామశాఖ కార్యవర్గం, క్రియా వాలంటీర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.