మహా సముద్రం ఫస్ట్ లుక్ విడుదల..

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పోతున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. శ్రీకారం మూవీ ట్రైలర్ రీసెంట్‌గా విడుదల కాగా, ఇది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ రోజు శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా మహా సముద్రం నుండి శర్వానంద్ లుక్ విడుదల చేశారు. చేతిలో ఇనుప ఆయుధం పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు శర్వా. ఈ పిక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కమర్షియల్ సక్సెన్‌ను అందుకున్న డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్‌ లవ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత సిద్ధార్థ్‌ మళ్లీ ఈ చిత్రం ద్వారా ప్రేక్షుకుల ముందుకు వస్తున్నాడు.