టిడిపి ఎంపీ, ఎమ్ ఎల్ ఏ అభ్యర్దుల ప్రచారం

అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, నిమ్మకాయల కొత్తపల్లిలో గురువారం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం జరిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిడిపి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగి, అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి అయితాబత్తుల ఆనంద రావులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.