శాతవాహన నగర్లో సంకల్ప యాత్ర

ఏలూరు, 24 వ డివిజన్ పరిధిలోని శాతవాహన నగర్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వం కబంధహస్తాల నుంచి ప్రజలను రక్షించడమే కూటమి లక్ష్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన-టిడిపి-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి, ఏలూరు జనసేన ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఏలూరు 24వ డివిజన్‌ శాతవాహన నగర్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో వారు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరించారు. ప్రతిచోటా బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారు. తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్‌, మట్టి, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రాష్ట్రానికి భవిత ఉంటుందని పేర్కొన్నారు. నరరూప రాక్షసులను గెలిపించుకుంటే భావితరాల జీవితాలు మనమే నాశనం చేసినవారమవుతామన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఏలూరు నగరంలో నెలకొన్న సమస్యల పట్ల ఏ రోజూకూడా శ్రద్ద చూపని ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఎన్నికల సమయంలో శిలాఫలకాలు ఆవిష్కరిస్తూ హంగామా చేస్తున్నారని పలు విధాలుగా విమర్శలు చేశారు. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జనసేన ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ 40 రోజుల పాటూ ప్రతిఒక్కరూ తమకోసం కాకుండా తమ పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చించి కూటమి అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దీన్ని చూసి సహించలేకపోతున్న ప్రజలు మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా..?? తమ ఓటు ద్వారా ఎప్పుడు బుద్ది చెబుదామా..?? అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాకంఠకుడిగా మారిన జగన్మోహన్‌ రెడ్డిని జైలుకు పంపేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. భావితరాల భవిష్యత్తు కోసం కూటమికి పట్టం కట్టాలని, బడేటి చంటిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్,రెడ్డి గౌరీ శంకర్, అల్లు సాయి చరణ్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, నూకల సాయి,జనసేన రవి, ఎమ్.డి.ప్రసాద్, కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి, 24 వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ కడియాల విజయలక్ష్మి, టీడీపీ డివిజన్ నాయకులు కావూరి జిన్నా, వేమూరి శ్రీధర్, కానాల శ్రీనివాస్, కామినేని శ్రీకృష్ణ మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.