శనివారపు పేటలో ప్రజా సంకల్ప యాత్ర

  • 26వ డివిజన్ శనివారపు పేటలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర
  • రెడ్డి అప్పల నాయుడు ఆదేశాల మేరకు సంకల్ప యాత్రలో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు

ఏలూరు: రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే బటన్‌ నొక్కేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ టిడిపి, జనసేన, బీజేపి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు.. ఏలూరు 26వ డివిజన్‌ న్యూ అశోక్‌ నగర్‌లో బుధవారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. కూటమిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యతను తెలియజెప్పారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పోలింగ్‌ తేదీ ఎప్పుడు వస్తుందా. ఎప్పుడు వైసిపి కబంధహస్తాల నుంచి బయటపడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. సొంత కుటుంబానికే నష్టం చేకూర్చిన సైకో జగన్‌ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తారన్న చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి డాక్టర్‌ సునీత, వైఎస్‌ షర్మిళ అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.. అంతే కాకుండా ఈ హత్యపై చర్చించేందుకు డాక్టర్‌ సునీత చేసిన సవాల్‌ను కూడా ఆయన స్వీకరించాలన్నారు.. గత ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన మాయమాటలు నమ్మి జనం మోసపోయారని, అయితే ఇప్పుడు వాస్తవాలు ఒకటొకటి బయట పడుతుండడంతో జగన్‌ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసిపికి ప్రజలంతా ఓటుతో బుద్దిచెప్పాలని, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే కూటమికి విజయం చేకూర్చిపెట్టాలని ఆయన కోరారు..ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన క్లస్టర్ ఇంచార్జీ సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్, జనసేన నాయకులు దోనేపూడి లోవరాజు, సరిది రాజేష్, అల్లు సాయి చరణ్, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కూనిశెట్టి మురళి,కొనికి మహేష్, రెడ్డి గౌరీ శంకర్, జనసేన రవి, కురెళ్ళ భాస్కర్, మేకా సాయి, శ్రీరామ్, సాయిరామ్ సింగ్, ఎమ్.డి.సురేష్, వెంకట రమణ, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ గూడవల్లి వాసు డివిజన్ ఇంచార్జ్ చేకూరి గణేష్, లంకపల్లి మాణిక్యాలరావు, సోమిశెట్టి రాము, తాకాసి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.