ఫ్రస్టేటెడ్ ప్రసన్న హటావో కోవూరు బచావో

  • కోవూరు అభివృద్ధి మా కూటమి తోనే సాధ్యం. ఈ నియోజకవర్గంలో 6 సార్లు ప్రసన్న ఎమ్మెల్యే అయ్యాడు
  • ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి కానీ ప్రసన్న కది చేతకాదు, అందుకే ఎన్నో సమయాల్లో ఇక కోవూరు ఎమ్మెల్యేగా నువ్వు దిగిపో అని ప్రస్తావించడం జరిగింది

గండవరం, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం, బిజెపిల ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారిని గెలిపిచాలి అంటూ.. పార్టీలో చేరిన గ్రామ పెద్దలతో ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలలతో బహిరంగ సభలో.. గునుకుల కిషోర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇక్కడ రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఎన్నిసార్లు గెలిచినా ఒక నాయకుడిగా కనీసం ఒక్క హాస్పిటల్ కూడా కట్టించలేకపోయాడు. కోవూరులో సరైన విద్య, వైధ్యం అందటం లేదు.. నియోజకవర్గంలో గ్రామాలకు సరిగా రోడ్లు లేవు.. గ్రామ నిధులు అసలే లేవు..
అక్రమంగా ఇసుక, గ్రావెల్, మట్టిని దాచుకొని దోచుకుంటున్నారు. అలాగే కనిపించిన స్థలాలన్నింటినీ అక్రమంగా కబ్జా చేస్తూ నియోజకవర్గాన్ని దోచుకుతినడం తప్ప ప్రజాసేవ చేయలేని నాయకుడు ప్రసన్న. జిల్లాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ ప్రసన్న. అందుకే కొత్తగా భూ చట్టం కూడా కోవూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేశారు. దీని వలన మన భూములు ఎప్పుడు ఎవరు ఎక్కడైనా ఎత్తేసే అవకాశం ఉంది. దాని గురించి న్యాయస్థానంలో ప్రస్తావించాలంటే జిల్లా పరిధి దాటి ప్రవర్తించాలి లేకపోతే దానికి ఒక ప్రత్యేక కోట్లు ఏర్పాటు చేసే విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కుటుంబంలో బిడ్డ ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులను అనుమానిస్తారు. ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆర్ఎంపీగా సేవ చేసిన ఒక పెద్ద ఆవిడ మీరిచ్చిన ఇల్లు నివాసయోగ్యంగా లేవు అంటే జూబిలీ హిల్స్ లో ఇవ్వమంటావా అని తమాషా పడతారు. నియోజకవర్గంలో ఒక మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే నోటికొచ్చినట్లు మాట్లాడతావు. జగనన్న ఇల్లు శోభనానికి కూడా పనికిరావు అని ఆనాడు నువ్వు మాట్లాడిన నీ దిగజారుడు మాటలు, నీ ఏ గ్రేడ్ కామెంట్స్ ఏ తెలియజేస్తుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో. ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి హానికరం. నీకు సంస్కారం లేదు అందుకే త్రిబుల్ ఎక్స్ సబ్బుతో ప్రక్షాళన చేయాలి. నడిరోడ్డు మీద ఆడది బయట తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చెప్పినట్టు, కుటుంబ పరిపాలన ఏ విధంగా సుభిక్షంగా సాగుతుందో ఆ విధంగా సాగాలంటే కుటుంబాన్ని సమన్వయపరిచే మహిళలు రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు చెప్పారు. అటువంటిది ఆ ప్రయత్నం ముందుకు సాగుతున్న తరుణంలో ఓ తల్లి తనపరిచయాన్ని నిర్భయంగా చెప్పింది. ఆ రోజే ప్రశాంతమ్మ కోవూరు నియోజకవర్గం లో గెలిచింది. భారీ మెజారిటీతో మేము గెలిపించడానికి ప్రజలు సిధ్ధమయ్యారు. కానీ ఆమె గుండె చాటున బాధని, ఆమె బిడ్డతో పాటు మేము అందరం కూడా స్వీకరించాం. ఇది నీ పతనానికి ఇది నాంది ప్రసన్న. వీపీఆర్ ఉచితంగా ఎంతోమందికి విద్య వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా మంచినీటి సరఫరా ఎంతోమందికి అడగకుండానే సేవలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో మరింత సేవ ఏర్పాటు చేయగలరు. ఒక మంచి హాస్పిటల్ ని కోవూరు నియోజకవర్గ నుంచి ఏర్పాటు చేయగలరు. పేదరిక నిర్మూలన చేయగలరు, అదే విధంగా నాణ్యమైన విద్యను అందించగలరు. అన్యాయం, దౌర్జన్యం, అక్రమం ఎరుగని వ్యక్తులు వేరు. వీళ్ళని తిడితే భగవంతుడు చూసుకుంటారులే అని సర్దుకునే సున్నిత మనస్కులు, కానీ మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎంత ఆవమానించారో అంతకంత మీరు అనుభవించే విధంగా చేయడానికి మేము సంసిద్ధం. ప్రస్టేటెడ్ ప్రసన్న హటావో కొవ్వూరు కాన్స్టెన్సీ బచావో.