ఎలక్షన్ క్యాంపెయిన్ సమన్వయ కమిటీ సమావేశం

నంద్యాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో త్రిముఖ కూటమి జనసేన-బిజెపి-టిడిపి పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు సూచన మేరకు నంద్యాల జిల్లాలో ఎన్.డి.ఎ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసే విధంగా నంద్యాల పార్లమెంట్ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా అభిరుచి మధును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా కో-ఆర్డినేటర్ గా ఎంపిక అయిన అభిరుచి మధు జిల్లాలో బిజెపి పార్టీ బలోపేతం కోసం, అలాగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసే విధంగా బిజెపి నాయకులు, కార్యకర్తల ఎన్నికల సమన్వయ కమిటీ మీటింగ్ లను జిల్లా వ్యాప్తంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే డోన్ నియోజకవర్గంలో పర్యటించారు. డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకట రమణ అధ్యక్షతన డోన్ బిజెపి ఎన్నికల సన్నాహక మీటింగ్ జరిగింది. నంద్యాల పార్లమెంట్ కో ఆర్డినేటర్ అభిరుచి మధు మాట్లాడుతూ ఎన్.డి.ఎ కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం మిత్ర ధర్మం పాటిస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ ను కూటమి అభ్యర్థులతో పాటు కలిసి చేసేలా బిజెపి సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకరిని మరొకరు సమన్వయము చేసుకుంటూ వెళ్ళాలని అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ, అలాగే డోన్ బిజెపి సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటూ వారికి మార్గనిర్దేశనం చేయడం జరిగింది. ఎన్నికల సమన్వయ కమిటీ మీటింగ్ ను విజయవంతం చేసిన డోన్ బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ అభిరుచి మధు ధన్యవాదాలు & కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నటరాజ్, డోన్ మండల అధ్యక్షులు రాజశేఖర్, రవికుమార్, ప్యాపిలి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు, బేతంచర్ల మండల అధ్యక్షులు ఆంజనేయులు, రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు హేమ సుందర్ రెడ్డి, జిల్లా బిజెపి కార్యదర్శి వడ్డే మహారాజ్, ఓబీసీ, ఎస్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కేసి మద్దిలేటి, శివకుమార్, బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య జిల్లా ఎస్సీ, ఎస్టీ, బిసి మోర్చ అధ్యక్షులు భరణి రమేష్, దేవేంద్ర, బాలకృష్ణ, రాఘవేంద్ర ఆచారి, ఉషాలక్ష్మి, జొన్నగిరి శివ, ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.