జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి జయహో బీసీ

రంపచోడవరం, ఎటపాక మండలంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు జనసేన తెదేపా సమన్యకర్త కుర్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఉమ్మడి అభ్యర్థులు గెలిపే ద్యేయంగా ముందుకు సాగాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ ఆధ్వర్యంలో గుండాల కాలనీ సభా స్థలి వద్ద 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీని తప్పుదోవ పట్టించే చీడపురుగులు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని పట్టుమని పదిమంది లేకుండా కార్యకర్తలు ఆందోళన కలిగించేలా వ్యవహరిస్తున్నారని అవేమీ జనసైనికులు నమ్మవద్దని పార్టీ కోసం పని చేయమని అదేవిధంగా 9 మండలాల అధ్యక్షులు, 11 మండలాల నాయకులు కొర్ల రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా నడుస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్, మారేడుమిల్లి మండల అధ్యక్షుడు మళ్ళా దుర్గాప్రసాద్, వి.ఆర్.పురం మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, మారెడుమిల్లి మండల ఉపాధ్యక్షులు బీశెట్టి సత్య, రాజవొమ్మంగి మండల యూత్ ప్రెసిడెంట్ లోకేష్, అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, నియోజకవర్గ నాయకులు కొణతం శ్రీనివాస్,వి.ఆర్.పురం మండల కార్యదర్శులు కోట్ల రామ్మోహన్ రెడ్డి, బాగుల అంజనరావు, చింతూరు మండల నాయకులు ఆనందం పెద్ద, ఎటపాక మండల ఉపాధ్యక్షులు ఎడ్ల లోకేష్,మంద సుబ్రహ్మణ్యం, మోల సతీష్, కొమ్ము వెంకట్, ప్రధాన కార్యదర్శి రంజిత్, కార్యదర్శి కొట్టే ప్రశాంత్, పండు, ప్రధాన కార్యదర్శి కోయ్యల రాజు కుంజా అర్జున్ మరియు 11 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *