కొత్తూరు జూట్ మిల్లు మూసివేత దారుణం

  • మిల్లు మూసేయడం కార్మికులకు అపార నష్టం
  • ఇప్పటికే ఏలూరు జూట్ మిల్లు మూసివేత తో 2000 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు
  • ధ్వజమెత్తిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు శివారు కొత్తూరు జూట్ మిల్లు కొద్ది రోజులుగా లాకౌట్ లో ఉందని, మిల్లును మూసివేసేందుకు మిల్లు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తుందని, తద్వారా 2000 వేల మందికి పైగా కార్మికులు నష్టపోతారని ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.. ఇప్పటికే ఏలూరు జూట్ మిల్లు మూతతో 2000 మందికి పైగా జూట్ మిల్లు కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు.. కొత్తూరు జూట్ మిల్లు కూడా మూసేస్తే మరో రెండు వేలమంది రోడ్డున పడతారన్నారు.. ఏలూరు జూట్ మిల్లు మూసేసిన సమయంలో ఆళ్ల నాని ఉపముఖ్యమంత్రిగా ఉన్నారని, యాజమాన్యంతో మాట్లాడి అది మూతపడకుండా చేయలేకపోయారని ఆరోపించారు.. ఇప్పుడు కొత్తూరు జూట్ మిల్లు విషయంలోనైనా యాజమాన్యంతో మాట్లాడి మిల్లును మూతపడకుండా చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. 20 ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తున్న జూట్ మిల్లును మూసివేస్తున్నట్లు, యాజమాన్యం గేటు బయట బోర్డు పెట్టడం కార్మికుల బతుకులను రోడ్డున పడేయడమేనని అన్నారు.. ఇప్పటికే 2000 మంది జూట్ మిల్లు కార్మికులు ఉపాధి కోల్పోయారని, కొత్తూరు మిల్లు మూసివేతతో మరో రెండు వేల మంది ఉపాధి కోల్పోతారని, మిల్లు మూసివేత చట్ట విరుద్ధమని తెలిపారు.. మిల్లు మూసివేతకు యాజమాన్యం చెబుతున్న కారణం సహేతుకం కాదని అన్నారు.. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మిల్లును తెరిపించే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.