నిమ్మక జయకృష్ణను మర్యాద పూర్వకంగా కలిసిన గర్భాన సత్తిబాబు

  • పాలకొండ ఉమ్మడి అభ్యర్థిగా “నిమ్మక జయకృష్ణ” ప్రకటన అనంతరం, మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా నాయకులు గర్భాన సత్తిబాబు

పాలకొండ జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణని అధికారిక ప్రకటన అనంతరం స్వగ్రామంలో జనసేన పార్టీ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా నాయకులు గర్భాన సత్తిబాబు, పాలకొండ బిజెపి నియోజకవర్గం నాయకురాలు తాడంగి సునీత, తెలుగుదేశం పాలకొండ మండల అధ్యక్షులు గండి రామినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు తేజవతి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరు పార్టీ నేతలు చర్చలు జరిపారు. అనంతరం భవిష్యత్తు కార్యచరణ ఏవిధంగా ఉండాలనే దానిపై స్పష్టతకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీల కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *