పార్టీని వీడి వెళుతున్న నాయకుల వెంట వారి నీడ తప్పితే క్యాడర్ తోడు రాదు

నెల్లూరు, జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ సూచనలతో జిల్లా జనసేన నాయకులతో స్థానిక మాగుంట లేఔట్ నందు గల కృత్మ్గా ఫంక్షన్ హాల్ నందు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు కోసం సుదీర్ఘ ప్రయాణం చేయగల సామాన్యులతో రాజకీయం చేయించేందుకు జనసేన పార్టీని ఏర్పరిచారు. ఈరోజున మాతోపాటు ఎంతో మంది నాయకులు అని చెప్పుకునే వారికి సమస్యలపై పోరాడేందుకు జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ ఇచ్చి మాకు గుర్తింపుని ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు పార్టీని వీడి వెళ్లినట్లయితే వారి నీడ తప్పితే మరెవరు వారితో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. బయట ఇతర పార్టీల వలే మందుకో, బియ్యానికో, డబ్బుకో వచ్చిన కార్యకర్తలు జనసేనలో లేరు. జనసేన నాయకులు ఎవరైనా పార్టీని విడిపోతే వారితో కలిసి ప్రయాణించిన వారు ఎవరు కూడా కలిసి వెళ్లే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పినట్టు జనసేన కార్యకర్తకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం ఒక రెండు గుండెలకు ఉన్నంత మాత్రామే..
ఈరోజున జనసేన నాయకులు ఎవరికైనా వారి వెనుక నడిచే జనసైనికులు పవన్ కళ్యాణ్ మాటలకు కట్టుబడి ప్రయాణిస్తున్నారు అన్న మాటలను గుర్తు చేసుకోవాలి. మరే ఇతర పార్టీల ద్వారానే రాజకీయం చేయాలనుకుంటే ఎంత దూరం వెయిట్ చేస్తే ఆయన పార్టీలో చేరడానికి కోట్లు వెనకేసుకున్న అనుభవం గల రాజకీయ నాయకులు అందరూ పార్టీలో చేరగలరు. అధికారం అందని కొన్ని అన్ని వర్గాల వారికి రాజ్యాధికారం అందే విధంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కట్టుబడి ప్రయాణించేవారు ఎటువంటి ప్రలోభాలకు లొంగరు. జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా యధావిధిగానే ఉంది. వెళ్ళిపోయిన ఒకరిద్దరు ద్వారా పార్టీకి ఏ విధమైన నష్టం కలగదు రానున్న రోజుల్లో జనసేన పార్టీ స్వయం ప్రతిపత్తి గల ఒక పెద్ద రాజకీయ వ్యవస్థగా మారనుంది. దానికోసం జనసైనికులు అందరూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడైనా నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అయినా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లే వాళ్ల వల్ల జనసేన పార్టీలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, కృష్ణ పెన్నాల పెన్నా జిల్లాలో రీజనల్ కో-ఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రవికుమార్, శేఖర్ రెడ్డి, జిల్లా లీగల్సెల్ అధ్యక్షుడు చదలవాడ రాజేష్, ఐటి వింగ్ ఇన్చార్జ్ శివకృష్ణ, గూడూరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చంద్రశేఖర్, సర్వేపల్లి నాయకుడు బోనబోయిన ప్రసాద్ యాదవ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సురేష్ బొబ్బేపల్లి, బలిజనాడు జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్, ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి నళిశెట్టి శ్రీధర్, కోవూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు హరిహరి రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గపు నాయకుడు తోట కృష్ణయ్య, గూడూరు నియోజకవర్గం నాయకులు మునిగిరిష్, జనసేన నాయకులు సూరి, అలేక్, సుల్తాన్, రాము, శీను, అనుదీప్, పవన్, మహిళా నాయకురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.