ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి యువత అండగా నిలవాలి

అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలని జి.భార్గవ్ దృష్టికి తీసుకెళ్ళగా మంచి మనసుతో అతని స్నేహితులకు విషయం చెప్పి ఆపదలో ఆదుకోవాలని గొప్ప మనిషిగా నిలిచారు. హాస్పిటల్ లో రక్తం కావాలని ఎవరికైనా ఆపద వస్తే ఫోన్ చేసిన వెంటనే స్పందించి తన పొట్ట కూటి కోసం తెరచిన చిన్న దుకాణం తలుపులు మూసివేసి మానవత్వం అనే తలుపు తెరచి నిస్వార్థంగా మంచి మనసుతో ఎంత దూరం అయిన వచ్చి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ కి కావలసిన రక్తం తాను స్వచ్చందంగా ఏమీ ఆశించకుండా రక్తదానం చేస్తూ తన తోటి స్నేహితులచే కూడా రక్త దానం చేయిస్తూ నిరంతరం సేవకుడు శ్రీకాకుళం కే.జగదీష్ 5వ సారి తన ఓ పాజిటివ్ రక్తం స్థానిక జెమ్స్ బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేయడం జరిగింది. అలాగే గొల్లపల్లి వంశీ కూడా బీ పాజిటివ్ మొదటి సారి డొనేట్ చేసారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలని అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవ సభ్యులు జి.భార్గవ్ కి తెలిపిన వెంటనే భార్గవ్ ఫోన్ చేస్తే మంచి మనసుతో స్పందించిన జగదీష్, వంశీ భార్గవ్ కి అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. వ్యవస్థాపకుడు గోపి బిసాయి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి యువత అండగా నిలవాలని కోరారు.