ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అంబేద్కర్

నెల్లూరు: భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి, అలాగే చిల్లకూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కరని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కరన్నారు. అంబేడ్కర్ గారికి నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరించడమేనన్నారు.
కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధము లేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యంగ ఫలాలు అందుతున్నాయి అంటే అది ఆయన చలవేనన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రనీల్, మోహన్, సాయి, తిరుపాలు, సురేష్, గిరి, యశ్వంత్, పెంచలయ్య, దావుద్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.