అంబేద్కర్ కు జనసేన ఘన నివాళులు

విజయనగరం: దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆ మహనీయునికి పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.