డా.బి.ఆర్.అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

  • అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన డా.బి.ఆర్. అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి. ప్రజల్ని చైతన్య పరచాలి. ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహనపై మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవ సమాజ నిర్మాణం లో భాగంగా అందరం కూడా భాగస్వాములు కావాలని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని జనసేన పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున ముందుకు తీసుకెళ్తామన్నారు. అనంతరం 3వ డివిజన్ పరిధిలోని నవాబు పేట, మారుతి నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, కుర్మా సరళ, ఎట్రించి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ, నాయకులు అగ్గాల శ్రీనివాస్, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, జగ్గా లక్ష్మి మోహన్ రావు, బెజవాడ నాగభూషణం, కొనికి మహేష్, రాచప్రోలు వాసు, రండీ దుర్గాప్రసాద్, వంశీ, వాసు నాయుడు, పవన్, దుర్గారావు, కృష్ణ, ప్రసాద్, వీరమహిళలు జొన్నలగడ్డ సుజాత, కొసనం ప్రమీల, గాయత్రి, గిడుతూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.