యు.పి.రాజు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజాం నియోజకవర్గం: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో రాజాం నియోజకవర్గం నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.పి.రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఒమ్మి గ్రామంలో జనసైనికులు ఆహ్వానం మేరకు అంబేద్కర్ జయంతి వేడుకుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు.అనంతరం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కొండ్రు మురళీ మోహన్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన జయంతి వేడుకుల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన నాయకులు మీసాల రాంబాబు కృష్ణ నాగరాజు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.