14వ డివిజన్ లో సంకల్ప యాత్ర

  • శివనగర్, సాయి నగర్, పుప్పాల సూరి నారాయణలో పర్యటించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి చంటి
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు, మధ్యాహ్నపు బలరాం

ఏలూరు: పచ్చి అబద్దాలు, నవ మోసాలతో అన్నివర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తోన్న సైకో సిఎం జగన్మోహన్‌ రెడ్డి వలలో మరోసారి పడేందుకు ప్రజలెవ్వరూ సిద్దంగా లేరని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి స్పష్టం చేశారు.. రాష్ట్రంలో అకస్మాత్తుగా కమ్ముకున్న జగన్మాయ నుండి బయటపడేందుకు ప్రజలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను ఆశీర్వదించాలని కోరారు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరినీ కలుస్తూ, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ వస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి.. ప్రజాక్షేత్రంలో నిత్యం నిలుస్తూ, వారి సమస్యలను తెలుసుకొనేందుకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఏలూరు 31, 32, 14 డివిజన్‌ల పరిధిలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయనతో పాటు రెడ్డి అప్పల నాయుడు, మధ్యాహ్నపు బలరాం పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరిస్తూ వారికి భరోసాను కల్పించారు. ఈ సందర్భంగా శివ నగర్,సాయి నగర్ కాలనీలో సంకల్ప యాత్రలో పర్యటించిన రెడ్డి అప్పల నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ డివిజన్ లో ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ఈ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ మరుగున పడిందని, వీధి లైట్లు సక్రమంగా పని చేయడం లేదు.. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రజా అణచివేతతో అందరూ విసిగి చెంది ఉన్నారు. ఇంటి పన్నులు, చెత్త పన్నులు, కరెంటు బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. మే 13వ తేదీన జరుగబోయే ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి చంటి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన డివిజన్ ప్రజలను అభ్యర్థించారు..ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నాయకులు సరిది రాజేష్,అల్లు సాయి చరణ్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, జనసేన రవి, కోలా శివ, నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమా దుర్గ, గుదే నాగమణి, కొసనం ప్రమీల, గాయత్రి భారీ సంఖ్యలో జనసేన తెలుగుదేశం బిజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.